ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరగడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jul 16,2024
';

బార్లీ ఇడ్లీలలోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

బార్లీ ఇడ్లీల్లో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

';

ఈ ఇడ్లీల్లో ఉండే కొన్ని మూలకాలు కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.

';

ముఖ్యంగా బార్లీ ఇడ్లీలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీరు కూడా ఇంట్లోనే బార్లీ ఇడ్లీలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేయండి.

';

బార్లీ ఇడ్లీలకు కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు - ఒక కప్పు, ఉప్పుడు బియ్యం - రెండు కప్పులు

';

కావాల్సిన పదార్థాలు: మినపపప్పు - ఒక కప్పు, మెంతులు - అర స్పూన్, ఉప్పు - తగినంత, తరిగిన కూరగాయలు (క్యారెట్, చిక్కుడు ముక్కలు)

';

తయారీ విధానం: మినపపప్పు, మెంతులు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

';

తర్వాత వీటిలో బార్లీ గింజలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పు కలుపుకుని ఐదు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

ఐదు గంటల తర్వాత పిండిని బాగా కలిపి, ఇడ్లీ రేకుల్లో నెయ్యి రాసి పిండిని వేసుకోవాలి.

';

మీకు నచ్చిన కూరగాయ ముక్కలను పైన వేసుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. అంతే, బార్లీ ఇడ్లీ రెడీ!

';

VIEW ALL

Read Next Story