ఉత్తర నైజీరియాలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడం చాలా సాధారణం. ఇరిగ్వే తెగలో మహిళలు సాంప్రదాయకంగా సహ భర్తలను తమ భర్తలుగా స్వీకరిస్తారు.
ఆగస్ట్ 2013లో కెన్యాలో జరిగిన ఓ సంఘటనతో మొత్తం సీన్ మారిపోయింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన తరువాత అక్కడ మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగే ఉండే హక్కు వచ్చింది.
చైనాలోని పాలియాండ్రీ జాతులలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను పెళ్లి చేసుకోవచ్చు.
టిబెట్‌లో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండే ఆచారం చాలా కాలంగా ఉంది. పిల్లలు ఎక్కువ మంది తండ్రుల ప్రేమకు అర్హులని ఆ దేశ ప్రజల విశ్వాసం.
దక్షిణ అమెరికాలోని బొరోరో కమ్యూనిటీకి చెందిన స్త్రీలు ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను పెళ్లి చేసుకునే హక్కు ఉంది.