మోసం చేయడం అనేది వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆడ, మగ తేడా ఉందడు. మోసం చేసే వ్యక్తిత్వం ఉన్నవారిలో ఆడవారు, మగవారు ఇద్దరూ ఉంటారు.
ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసం చేస్తున్నడంటే..అతనిలో స్వార్థపూరిత బుద్ధి ఉందని గ్రహించాలి. ఇందులకు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉదాహరణే. ఏ అబ్బాయి అయితే స్వార్థంతో ఆలోచిస్తాడో ఆ అబ్బాయి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థం.
కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల అందం, డబ్బును చూసి ప్రేమిస్తున్నానంటూ నమ్మిస్తాడు. మాయమాటలు చెబుతుంటాడు. అలాంటి అబ్బాయి మిమ్మల్ని మోసం చేసేందుకు రెడీగా ఉన్నట్లు అర్థం.
మోసం చేసేవారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. మోసం చేస్తున్నామన్న భావన అసలే ఉండదు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
మోసం చేసేవారు అబద్దాలు ఎక్కువగా చెబుతుంటారు. ఎలాంటి విషయమైనా ఈజీగా నమ్మిస్తారు. పనిపట్ల నిజాయితీ ఉండదు. కపట బుద్ధితో వ్యవహారిస్తారు.
ఒక అబ్బాయి అమ్మాయిని ఎలా మోసం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. ముఖ్యంగా అమ్మాయిలోని బలహీనతలను గ్రహించి వాటి ద్వారానే మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాడు.
అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయితే మోసం చేసే అబ్బాయిల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొన్ని సందర్బాల్లో కాళికలుగా మారుతారు. తమను మోసం చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించి వారి నుంచి దూరంగా ఉంటారు.
ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉండాలి. ఈ రెండు ఉంటేనే జీవితం హ్యాపీగా ముందుకు సాగుతుంది. వివాహా బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నిజాయితీగా ఉంటుంది. లేదంటే మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నిజమైన ప్రేమికులను విడదీయడం ఎవరితోనూ కాదు. కానీ అనుమానం, అసహనం అనే వాటితో జంటలు విడిపోతుంటారు. అందుకే ప్రేమలో నమ్మకమే పునాది.