స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ సందడి చేస్తున్నారు హీరోయిన్ ఆషిక రంగనాథ్. సిద్ధార్థ్ కలిసి మిస్ యూ తో అలరించేందుకు రెడీ అయ్యారు.
1996లో కర్నాటకలో జన్మించిన ఆషిక కన్నడ పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
కాలేజీ రోజుల్లోనే మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొన్న ఆషికా రన్నరప్ గా నిలిచారు. ఆ పోటీల్లో ఆషికను చూసిన దర్శకుడు మహేశ్ బాబు ఆషికాకు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు.
క్రేజీ బాయ్ అంటూ తొలి మూవీతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డును అందుకుని అందర్నీ ఆకట్టుకుంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ ఫొటోలను పోస్టు చేసింది.
అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగ మూవీలో నటించిన అందరి మన్ననలను పొందింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది