మీరంతా కొత్త సంవత్సరంలో రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా. ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మర్చిపోయారు. ఈ రిజల్యూషన్స్ ను కూడా మీ జీవితంలో పాటిస్తే జీవితాంతం మీరు ప్రశాంతంగా ఉంటారు.
మనలో చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో జిమ్ స్టార్ చేసి బాడీ పెంచాలని, బరువు తగ్గాలని, చెడు అలవాట్లు మానేయాలని..వాళ్లకు నచ్చినవి ప్రారంభించాలని అనుకుంటారు.
కానీ కొందరు మాత్రం ఈ రిజల్యూషన్స్ అస్సలు పట్టించుకోరు. మార్పు అంటే మనలో నుంచి ప్రారంభం అవ్వాలని దానికి న్యూ ఇయర్ రిజల్యూషన్ అని పేరు పెట్టడం అనవసరం అంటారు.
రిజల్యూషన్స్ పెట్టుకున్నవారు ఈవిషయాన్ని జాగ్రత్తగా వినండి. అదే దరిద్రులకు దూరంగా ఉండం. అక్కడ దరిద్రులు అంటే ఎవరని అనుకుంటున్నారు కదా.
మనలో చాలా మంది పాజిటివ్ గా బతకాలి..అన్నింట్లో పాజివిటి ఉండాలని కోరుకుంటారు. కానీ కొందరు ప్రతి విషయాన్ని నెగెటివ్ గా తీసుకుంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి.
ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు మీ దగ్గర్లో ఉంటే వెంటనే వారికి దూరంగా ఉండండి.
మనలో చాలామంది ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు ఫేక్ అని కనిపెట్టడం చాలాకష్టం. ఒకసారి ఫేక్ అని తెలిసిన తర్వాత వారిని దూరంగా పెట్టాలి.
మనకు చాలా మంది ఫేక్ ఫ్రెండ్స్ జాబ్ చేసే ప్లేసులో కనిపిస్తుంటారు. నేటికాలంలో ఇంటి దగ్గర కంటే ఎక్కువగా ఆఫీసులోనే సమయం గడుపుతుంటాం. ఆఫీస్ వ్యక్తులతో వర్క్ పరంగా క్లోజ్ గా ఉండటం మంచిది.
మనం సరిగ్గా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతే చాలు. కానీ తెలియకుండానే మనకు శత్రువులు ఏర్పడుతుంటారు. పనిచేసేవారిపై ఎప్పుడూ ఏడుస్తుంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలి.