చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ముందుగానే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
';
చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
';
కొంతమందిలో చెడు కొవ్వు పేరుకుపోవడం కారణంగా గుండె కూడా ఫెయిల్ అవుతోంది. దీంతో మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంది.
';
అలాగే ఇంకొంతమందిలోనైతే చెడు కొవ్వు పెరిగిపోయి.. విపరీతమైన బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
';
అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం చాలా సులభం. కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించి కూడా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.
';
ముఖ్యంగా చెడు కొవ్వు ఉన్నవారు రోజు ఉదయాన్నే యాపిల్ సైడర్ వెనిగర్ నిమ్మకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
';
మీరు కూడా ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ నిమ్మకాయ రసం తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తయారు చేసుకోండి.