పిల్లల కోసం హెల్తీ బానానా ప్యాన్‌ కేక్స్‌..

Dharmaraju Dhurishetty
Jul 25,2024
';

ప్యాన్‌ కేక్‌లను ఎక్కువగా గ్రీకులు, రోమన్లు ప్రధాన అల్పాహారంగా తీసుకునేవారట.

';

దీనిని గోధుమ పిండి, గుడ్లు, పాలు వంటి పదార్థాలతో తయారు చేస్తారు.

';

పోను పోను 19వ శతాబ్దంలో ప్యాన్‌ కేక్‌లు అమెరికాలో ప్రసిద్ధి చెందుతూ వచ్చాయి.

';

ఈ ప్యాన్‌ కేక్‌లను వివిధ దేశాల వారు వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు.

';

భారతీయులు ఎక్కువగా అరటి పండ్లు, బిస్కెట్స్‌తో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు.

';

బానానా ప్యాన్‌ కేక్‌లను మీరు కూడా టేస్ట్‌ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బానానా ప్యాన్‌ కేక్‌లకి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద పండిన అరటి పండ్లు, 1/2 కప్పు పిండి, 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు పాలు

';

కావాల్సిన పదార్థాలు: 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీస్పూన్ వనిల్లా ఎసెన్స్, 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు బాదంపప్పు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో 2 పెద్ద పండిన అరటి పండ్లను మెత్తగా గుజ్జులా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

మరొక గిన్నెలో గోధుమ పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.

';

ఆ తర్వాత పాలు, గుడ్డు, నూనె, వనిల్లా ఎసెన్స్ కలపాల్సి ఉంటుంది.

';

ఇలా బాగా కలిపిన తర్వాత బాదంపప్పు ముక్కలు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఒక వేడి ప్యాన్‌లో నూనె లేదా వెన్న వేసి, ప్యాన్‌లో పిండిని ఒక పెద్ద చెంచాతో వేయండి.

';

ప్యాన్‌కేక్‌లు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ప్రతి వైపు 2 నుంచ 3 నిమిషాలు ఉడికించాలి. అంతే సులభంగా ప్యాన్‌ కేకులు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story