వృథాగా పారబోసే బియ్యం నీటిని ఇలా వాడండి.. హీరోయిన్ను మించే అందం మీదే!
బియ్యం కడిగిన నీళ్లు వృథాగా పారేయకండి. చర్మాన్ని నిగారింపు చేసుకునేందుకు బియ్యం నీళ్లు పనికి వస్తాయి.
బియ్యం నీళ్లు చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా వృద్ధాప్యం రాకుండా దాచిపెడుతుంది.
బియ్యం నీళ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం అందానికి దోహదం చేస్తాయి.
బియ్యం నీళ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉన్న ముడతలను తగ్గించేందుకు సహాయం చేస్తాయి.
అమినో యాసిడ్స్ చర్మంలో కొల్లాజెన్ మొత్తాన్ని పెంచుతాయి. దీనిద్వారా వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
బియ్యం నీటిలో విటమిన్ బీ, సీ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేటట్లు చేయడమే కాకుండా మృదువుగా మారుస్తాయి.
బియ్యాన్ని 2-3 కప్పుల నీటిలో నానబెట్టి 30 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం ఫిల్టర్ చేసి ఒక స్ప్రే బాటిల్లో నింపి ఉంచండి.
బాటిల్లో నింపిన నీటిని స్ప్రేగా రోజూ తలస్నానానికి ముందు ముఖంపై వేసుకోండి. అలా కాకుండా దూదిని బియ్యం నీటిలో ముంచి ముఖానికి రాసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
మా వార్తలను చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఈ వార్త మీకు అవగాహన కల్పించే ఉద్దేశం తప్ప ఈ సమాచారాన్ని మేం నిర్ధారించడం లేదు. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు. దీనికి సంబంధించి ముందుగా నిపుణుల సలహాలు తీసుకుని ప్రయత్నం చేయండి.