వేల సంవత్సరాలగా.. మహిళల చర్మానికి బియ్యప్పిండి ఎంతో మేలు చేస్తోంది..
మరి ఇప్పటివరకు మీకు ఈ విషయం తెలియకపోతే ఈ.. బియ్యప్పిండి మాస్క్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి
ముందుగా బియ్యాన్ని పిండిలా చేసుకుని.. ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించండి.
15 నిమిషాలు ఈ మాస్క్ ని.. మొహం పైన అలానే వదిలేయండి. తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోండి.
ఇది మొఖం పైన మురికిని పూర్తిగా తొలగిస్తుంది.
అలాగే బియ్యప్పిండిలో.. కొంచెం పెరుగు కలుపుకుని ఫేస్ మాస్కులా వేసుకున్నా చాలా మంచిదే.
బియ్యప్పిండి, ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ కలిపి.. మాస్క్ వేసుకుంటే.. జిడ్డు చర్మం కాస్త మిళమిళ మెరిసిపోతుంది.
బియ్యప్పిండి, పాలు కలిపి లేదా బియ్యప్పిండి, పసుపు కలిపి కూడా ఫేస్ మాస్క్ వేసుకోవడం.. ఎన్నో ఉపయోగాలను కలిగిస్తుంది.