బీట్‌రూట్ పులావ్.. వారంలో ఒక్కసారైనా తినండి..

';

ప్రతి వారం ఈ బీట్‌రూట్ పులావ్‌ను పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అంతేకాకుండా బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు రైస్‌కి పట్టుకుని శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి.

';

బీట్‌రూట్ పులావ్ క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

';

ఈ బీట్‌రూట్ పులావ్‌ను మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల బాస్మతి బియ్యం, 2 పెద్ద బీట్‌రూట్లు(తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి), 1/2 కప్పు ఉల్లిపాయ(తరిగిన), 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ ఎర్ర మిరపకాయల పొడి

';

కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 కప్పుల నీరు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి

';

తయారీ విధానం: ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఒక పెద్ద కుక్కర్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.

';

ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

';

ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఎర్ర మిరపకాయల పొడి వేసి బాగా కలపాలి.

';

బీట్‌రూట్ ముక్కలు, ఉప్పు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి.

';

ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, నీరు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు ఆవిరి పోనివ్వండి. తర్వాత కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.

';

VIEW ALL

Read Next Story