ఉప్పుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో పింక్ సాల్ట్ ఒక రకం.
సాధారణ ఉప్పుతో పోలిస్తే గులాబీ ఉప్పు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తుంది.
పింక్ సాల్ట్ వంటల్లో వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గులాబీ ఉప్పుగా పిలిచే పింక్ సాల్ట్‌లో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఈ ఉప్పులో పుష్కలంగా లభించే ముఖ్యమైన ఖనిజాలు ఎముక బలానికి దోహదం చేస్తుంది. ఈ ఉప్పు ఎముకలను ఆరోగ్యంగా చేస్తాయి.
శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఈ ఉప్పు ప్రయోజనం కలిగిస్తుంది. హలోథెరపీ లేదా సాల్ట్ థెరపీ అని పిలిచే ఉప్పుతో శ్వాస పీల్చుకోవడం, ఉబ్బసం, అలెర్జీలు వంటి శ్వాసకోశ వ్యాధులను మెరుగుపరుస్తుంది.
పింక్ సాల్ట్‌లో జింక్, సెలీనియం వంటివి రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. శరీరం అంటువ్యాధులతో పోరాడే శక్తిని.. కడుపులో మంటను తగ్గించడానికి గులాబీ ఉప్పు సహాయ పడుతుంది.
శరీర కణాలు, కణజాలాల నుంచి విషాన్ని తొలగించడంలో గులాబీ ఉప్పు దోహదం చేస్తుంది.
పింక్ సాల్ట్‌లోని ఉన్న పోషకాలు, ఖనిజాలు నరాల బలహీనతను తగ్గిస్తాయి.
పింక్ సాల్ట్ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. హృదయనాళ పనితీరు, మూత్రపిండాల ఆరోగ్యం పనితీరును మెరుగు చేస్తుంది.