రక్తాన్ని పీల్చే జంతువులు

జీవ జాతుల్లో రక్తాన్ని పీల్చే జంతువులు కొన్ని ఉన్నాయి. అవి రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.

Ravi Kumar Sargam
Jul 18,2024
';

దోమలు

దోమలు రక్తం తాగే జీవుల్లో ఒకటి. ఆడ దోమలు గుడ్లు ఉత్పత్తి చేయడానికి రక్తాన్ని తింటాయి. దోమలు కాటువేసి రక్తాన్ని తాగుతాయి. అయితే దోమకాటుతో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయి.

';

లాంప్రే

చేపల్లో లాంప్రే ఒకటి. వీటిని దవడలు లేని చేపలు అంటారు. ఇవి రక్తం పీల్చడంతోపాటు మాంసం కూడా తింటాయి.

';

ఈగలు

క్షీరదాల రకానికి చెందిన ఈగలు రక్తాన్ని తినే పరాన్నజీవి కీటకాలు. ఈగలు వాలితే చికాకు, దురద, రక్తహీనత సమస్యలు కలుగుతాయి.

';

వాంపైర్ ఫించ్

పిచ్చుక జాతికి చెందిన వాంపైర్‌ ఫించ్‌ అనే పక్షి రక్తాన్ని తాగేస్తుంది. గాలాపాగోస్ దీవులలో ఈ పక్షి కనుగొన్నారు. రక్తాన్ని తాగడం కోసం తన పదునైన ముక్కు ద్వారా పొడిచి పొడిచి రక్తాన్ని తాగుతుంది.

';

పిశాచ గబ్బిలం

గబ్బిల్లాల్లో పిశాచ గబ్బిలం ఒక రకం. ఇది తన పదునైన దంతాలను ఉపయోగించి చర్మం ఒలిచి రక్తం సేవిస్తుంది. ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలో ఉంటాయి.

';

కాండిర్‌

ఇది చేప జాతికి చెందిన కాండిర్‌ నీటిలో ఉంటుంది. ఇది రక్త పిశాచం. చిన్నగా తెల్ల రంగులో ఉండే కాండిర్‌ ఒంటిపై ఉన్న రక్తాన్ని పీల్చేస్తుంది. అమెజాన్, ఒరినోకో నదుల్లో కాండిర్‌ను చూడవచ్చు.

';

VIEW ALL

Read Next Story