Idly Dosa Chutney

పల్లీల చట్నీ తినడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. మరి అలాంటి వారి కోసమే.. ఇడ్లీ,‌ దోశల్లో తినడానికి ఈ టేస్టీ దొండకాయ చట్నీ.

Vishnupriya Chowdhary
Aug 16,2024
';

Dosa Chutney

స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసుకొని.. వేడెక్కాక అందులో.. ఒక స్పూన్ మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర.. కొద్దిగా కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

';

Idly Chutney

వీటన్నిటిని చల్లారాక.. మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. అదే కళాయిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి.. సన్నగా తరుగుకున్న పన్నెండు పచ్చిమిరపకాయలను.. పావు కిలో దొండకాయలను వేయించుకోవాలి

';

Variety Chutney

వాటిని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి.. చివర్లో నిమ్మకాయ సైజులో చింతపండు, కొత్తిమీరను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

';

Vegetable Chutney

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని.. ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి.. కలిపి రుబ్బుకోవాలి.

';

Yummy Chutney

ఆ తరువాత మళ్లీ స్టౌ పైన కడాయి పెట్టి.. తాలింపు వేసుకోవడానికి జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేయించుకోవాలి.

';

Chutney for Diabetics

ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ దొండకాయ చట్నీ సిద్ధం.

';

VIEW ALL

Read Next Story