పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించడం మొదటగా చేయాల్సిన పని.
పిల్లలకు బోధించడానికి సరళమైన మరియు స్పష్టమైన భాషను ఉపయోగించండి. సాధారణ ఉదాహరణలతో వారికి బోధించండి.
పిల్లలకు భోధించేటప్పుడు సృజనాత్మకతను జోడించండి. వారికి వినూత్నంగా చెప్పేందుకు ప్రయత్నించండి.
పిల్లల్లో ప్రశ్నించే ఆసక్తిని రేకెత్తించండి. మీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రోత్సాహించండి.
చిన్నారులకు ఒక ప్రెండ్ గా సపోర్టుగా నిలవండి, అంతేకాకుండా సహనంతో వ్యవహారించండి.
పిల్లలకు ఏదైనా విషయాన్ని విజువల్ గా చూపించే ప్రయత్నం చేయండి, అప్పుడే వారికి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది. దీని కోసం మీరు చిత్రాలు మరియు గ్రాఫ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
పిల్లల అభ్యాస నైపుణ్యాలను పెంచడానికి నిజ జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు త్వరగా నేర్చుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతారు. అందుకే మంచి పని చేసి అతడికి ఆదర్శంగా నిలవండి.