బిస్కెట్స్‌ కేక్‌.. మాములు ఉండదు..

Dharmaraju Dhurishetty
Jul 04,2024
';

కేకులను వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. మైదా పిండితో కాకుండా వివిధ రకాల పిండిలతో తయారు చేసుకుంటూ ఉంటారు.

';

బేకరీల్లో తయారు చేసిన కేకులు అతిగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉన్నాయి.

';

ఇంట్లోనే ఇలా సులభంగా బిస్కెట్స్‌తో కేకులను తయారు చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: బిస్కెట్స్ - 200 గ్రా , వెన్న - 100 గ్రా, పాలు - 100 మి.లీ

';

కావాల్సిన పదార్థాలు: చక్కెర - 1/2 కప్పు, కోకో పొడి - 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్, ఉప్పు - చిటికెడు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో బిస్కెట్స్‌ను చిన్న ముక్కలుగా విరిచి పెట్టుకోండి.

';

మరొక గిన్నెలో వెన్నను మెత్తగా కరిగించుకోండి. కరిగించిన వెన్నలో చక్కెర వేసి బాగా కలపండి.

';

ఆ తర్వాత వెన్నలోనే పాలు, కోకో పొడి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి.

';

బిస్కెట్ ముక్కలను పిండిలా తయారు చేసి ఈ మిశ్రమంలో వేసుకోండి.

';

ఇలా బాగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని 4 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.

';

ఒక కేక్ టిన్‌ను గ్రీజ్ చేసి, ఈ మిశ్రమాన్ని పోసి, 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నుంచి 35 నిమిషాలు బేక్ చేయండి.

';

కేక్ చల్లబడిన తర్వాత, మీకు ఇష్టమైన ఐసింగ్‌తో తీసుకుంటే చాలా బాగుటుంది.

';

VIEW ALL

Read Next Story