పొట్ట తగ్గించుకోవడానికి నానారకాల బాధలు పడుతూ ఉంటాం. అయితే కొన్ని తిండి పదార్థాలు తినడం ద్వారా కూడా పొట్ట తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?
ఉదయం పూట నూనెతో పూరీలు, దోశలు తినడం వల్ల ఓట్స్ తీసుకోండి. ఓట్స్ వల్ల శరీరంలో జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ తొందరగా కరుగుతుంది.
ఉదయాన్నే కప్పు నీళ్లల్లో.. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే.. అది తొందరగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించడమే కాదు... రక్తంలో చక్కెర స్థాయులనూ కూడా నియంత్రిస్తుంది.
బాదంపప్పులో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్.. శరీరంలో కొవ్వును కరిగించి.. బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గడంలో సహాయపడతాయి.
గుడ్డులో ప్రొటీన్ అధికంగా ఉందడం వల్ల.. ఇది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఇందువల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల కూడా పొట్ట చుట్టి ఉండే కొవ్వుని తొందరగా తగ్గించుకోవచ్చు..
మన ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల పొట్టను సులువుగా తగ్గించుకోవచ్చు..