రోజుకు ఒక ఈ లడ్డు తింటే.. శరీరానికి శక్తే శక్తి!

Aug 21,2024
';

నల్ల నువ్వుల్లో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు, విటమిన్స్‌ లభిస్తాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

నల్ల నువ్వుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్‌ల సమృద్ధిగా లభిస్తాయి.

';

నల్ల నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డును తినడం వల్ల రక్తహీనత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

';

మీరు కూడా ఇంట్లోనే నల్ల నువ్వుల లడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

నల్ల నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు: 1 కప్పు, బెల్లం: 1 కప్పు (తురుము), నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: 1/2 టీ స్పూన్

';

తయారీ విధానం..నువ్వులు వేయించడం: ఒక పాన్‌లో నల్ల నువ్వులను తక్కువ మంట మీద వేయించాలి. అవి సువాసన వచ్చే వరకు వేయించాలి.

';

బెల్లం పాకం తయారు: మరో పాన్‌లో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి పాకం తయారు చేయాలి. పాకం చిక్కబడిన తర్వాత పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నెయ్యి వేయడం: వేయించిన నువ్వులను పాకంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి, యాలకుల పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.

';

లడ్డూలుగా చుట్టడం: మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా లడ్డూలుగా చుట్టుకోవాలి.

';

సూచనలు: నువ్వులను వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అవి త్వరగా వేగిపోయి మాడిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

బెల్లం పాకం చిక్కబడినప్పుడు మాత్రమే నువ్వులను కలపాలి, లేదంటే లడ్డూలు సరిగా చుట్టలేవు.

';

VIEW ALL

Read Next Story