ఓట్స్, ఆవాలు, జీలకర్ర, మిరపపప్పు, అల్లం, కరివేపాకు, సమెలినా , క్యారెట్, కొత్తమీర, బేకింగ్ సోడా, ఆయిల్, కప్పు పెరుగు
ముందుగా కొద్దిగా నూనె పాన్ పోసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి.
తర్వాత అందులో చిటికెడు హింగ్ వేసి మినపప్పు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉంచాలి.
ఇప్పుడు అందులో అల్లం, కరివేపాకు, సమెలినా వేయాలి.
ఆ తర్వాత ఓట్స్ పొడి, ఉప్పు వేయాలి. అన్నీ మిక్స్ చేసి సన్న మంట మీద వేయించాలి. తర్వాత చల్లార్చాలి
చల్లారిన తర్వాత నీరు, పెరుగు, తురిమిన క్యారెట్, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. పది నిమిషాలు పక్కన పెట్టాలి.
స్టీమింగ్ కోసం ఇడ్లీ ప్లేట్ కు కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టాలి.
స్టీమర్ లో కొద్దిగా నీరు పోసి నింపి మరిగించాలి. ఇందులో సోడాను వేయాలి. ఆయిల్ పూసిన ఇడ్లీ పేట్లలో ఇడ్డీ పిండి నింపి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.
అంతే సింపుల్ ఓట్స్ ఇడ్లీ రెడీ. దీన్ని సాంబర్, చట్నీ తింటే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.