రోజు ఇది తింటే మధుమేహానికి బై బై.. అదనపు బరువుకు చెక్!

Dharmaraju Dhurishetty
Oct 06,2024
';

రోజు ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా మధుమేహం ఉన్నవారు సలాడ్స్ తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.

';

ముఖ్యంగా క్యాబేజీతో తయారుచేసిన సలాడ్ తినడం వల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

అలాగే బరువు తగ్గడానికి డైట్లు పాటిస్తున్న వారు రోజు ఉదయాన్నే ఈ సలాడ్ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఈ సలాడ్ ను డైట్ లో భాగంగా చేర్చుకోండి.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ క్యాబేజీ సలాడ్ ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేయండి..

';

క్యాబేజీ సలాడ్ కి కావలసిన పదార్థాలు: క్యాబేజీ - 1/2 ముక్క (తరిగినది), క్యారెట్ - 1 (తరిగినది), క్యాప్సికం - 1/2 (తరిగినది), ఉల్లిపాయ - 1 (తరిగినది)

';

కావలసిన పదార్థాలు: నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపోయినంత, మిరియాల పొడి - రుచికి సరిపోయేంత, కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)

';

తయారీ విధానం: ఈ సలాడ్ ను తయారు చేయడానికి ముందుగా క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికంతో పాటు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగండి.

';

ఓ చిన్న బౌల్ తీసుకొని తరిగిన అన్నింటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాత్రలో తరిగిన కూరగాయలను వేసి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.

';

ఇదే మిశ్రమంలో చివరగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ సలాడ్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story