ఈ ఉప్మా తింటే క్యాన్సర్ రాదట.. బరువు తగ్గొచ్చు!

Dharmaraju Dhurishetty
Jul 12,2024
';

ఓట్స్ ఉప్మాలో ఉండే ఫైబర్ శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ట్రై చేయండి.

';

ఇందులో అధిక మోతాదులో ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఓట్స్ ఉప్మాలో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతాయి.

';

ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని మూలకాలు క్యాన్సర్ వంటి కణాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఉదయం అల్పాహారంలో భాగంగా ఓట్స్ ఉప్మాను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఈ ఓట్ ఉప్మా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ మీకోసమే..

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 1 1/2 కప్పు నీరు, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ ఎర్ర మిరపకాయలు

';

కావలసిన పదార్థాలు: 1/2 ఉల్లిపాయ తరిగినది, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టమాట తరిగినది, 1/4 కప్పు క్యారెట్ తరిగినది

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు బీన్స్ తరిగినవి, 1/4 కప్పు కొత్తిమీర, తరిగినవి,ఉప్పు రుచికి సరిపడా, నూనె వేయడానికి

';

తయారీ విధానం: ఒక బాణలిలో వేడి నూనె చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటన్నింటిని బాగా వేయించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అందులోనే జీలకర్రలు వేగిన తర్వాత, పసుపు, ఎర్ర మిరపకాయలు, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

';

ఈ పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత ఇందులోనే టమాటా, క్యారెట్, బీన్స్ వేసి మెత్తబడేవరకు వేయించాలి.

';

ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఓట్స్ ను రవ్వలా తయారు చేసుకుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఓట్స్ ఊడికే వరకు, మధ్యలో కలుపుతూ ఉండాలి.

';

ఓట్స్‌ ఊడిన తర్వాత, కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story