వర్షాకాలంలో సందర్శించాల్సిన ఉత్తమ ప్రదేశాలు

Shashi Maheshwarapu
Jun 23,2024
';

వర్షాలు కురుస్తున్నప్పుడు, ప్రకృతి ఒక కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. చినుకులు చిమ్ముతూ, చల్లగా గాలి వీస్తూ, చుట్టూ పచ్చని చెట్లు...

';

ఇలాంటి వాతావరణంలో బయటకు వెళ్లి, ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంతకంటే ఆనందం ఏముంటుంది?

';

అందుకే ఈ వర్షాకాలంలో మీరు ఖచ్చితంగా సందర్శించాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాల లిస్ట్‌ ఇదిగో ..

';

చిరపుంజీ.. మేఘాలయలోని ఒక అద్భుతమైన పట్టణం. భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

';

హరిత కొండలు, జలపాతాలు, లోయలతో నిండిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది.

';

లోనావాలా భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె జిల్లాలో ఉన్న ఒక అందమైన పర్వత ఊరు.

';

లోనావాలా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. కొండలు, లోయలు, జలపాతాలు, సరస్సులు, దట్టమైన అడవులు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చాయి.

';

వయనాడ్ కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఒక జిల్లా.

';

సుందరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని కొండలు, లోతైన లోయలు, జలపాతాలు, కాఫీ తోటలకు ఇది ప్రసిద్ధి చెందింది.

';

మున్నార్ లో ఎటు చూసినా పచ్చని కొండలే కనిపిస్తాయి.

';

ఈ కొండలపై విస్తరించి ఉన్న తేయాకు తోటలు, కాఫీ తోటలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి.

';

కర్ణాటకలోని కొడగు జిల్లాను కూర్గ్‌ అని పిలుస్తారు. ఇది పశ్చిమ కనుమలలో ఉంది.

';

కూర్గ్‌ను "భారతదేశపు స్కాట్లాండ్" అని పిలుస్తారు. పచ్చని కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు స్కాట్లాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను గుర్తు చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story