గుండె పోటు ఛాతి నొప్పి Vs గ్యాస్ట్రిక్‌ ఛాతి నొప్పి..

Dharmaraju Dhurishetty
Jul 26,2024
';

ప్రస్తుతం చాలా మంది వేగంగా గుండెపోటు వస్తోంది.

';

చాలా మంది యువత గుండెపోటుతో మరణిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

గుండెపోటు వచ్చే ముందు అందరిలో వచ్చే కామన్‌ లక్షణం ఛాతి నొప్పి.

';

అలాగే చాలా మందిలో ఛాతి నొప్పి అనేది గ్యాస్ట్రిక్‌ కారణంగా కూడా వస్తోంది.

';

గుండెపోటు, గ్యాస్ట్రిక్ కారణంగా వచ్చే ఛాతి నొప్పులను చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు.

';

అయితే గుండెపోటు, గ్యాస్ట్రిక్ కారణంగా వచ్చే ఛాతి నొప్పుల మధ్య తేడాలేంటో ఇప్పుతు తెలుసుకోండి.

';

గుండెపోటు: ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపున భారంగా, గుచ్చుతున్నట్లుగా లేదా పిసుకుతున్నట్లుగా ఉంటుంది.

';

గ్యాస్ట్రిక్: ఛాతి దిగువ భాగంలో మండుతున్నట్లుగా లేదా నొప్పిగా ఉంటుంది.

';

గుండెపోటు: అలాగే ఈ ఛాతి నొప్పి ఎంతో వేగంగా వేగంగా భుజాలుకు కూడా ప్రవేశిస్తుంది.

';

గ్యాస్ట్రిక్: దీని కారణంగా వచ్చే ఛాతి నొప్పి ఆహారం తిన్న తర్వాత లేదా ఎక్కువగా వంగినప్పుడు తీవ్రత పెరుగుతుంది.

';

గుండెపోటు: కొంతమందిలో గుండె పోటు వచ్చే ముందు ఛాతి నొప్పి చేతులు నుంచి మెడ, దవడ లేదా వెనుక భాగాలకు కూడా ప్రవేశించే ఛాన్స్‌ కూడా ఉంది.

';

గ్యాస్ట్రిక్: గ్యాస్ట్రిక్ కారణంగా వచ్చే ఛాతి నొప్పికి ఎలాంటి వ్యాప్తి ఉండదు.

';

గుండెపోటు: ఛాతి నొప్పితో పాటు చెమటలు పట్టడం, అలసట, గుబాళించడం, తల తిరగడం, వాంతులు, చలి అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తాయి.

';

గ్యాస్ట్రిక్: దీని కారణంగా వచ్చే ఛాతి నొప్పి కారణంగా అజీర్తి, మంట, ఉబ్బరం, ఆమ్లం రుచి, దుర్వాసన వాయువులు వస్తాయి.

';

గుండెపోటు: విశ్రాంతి తీసుకున్నా లేదా మందులు వాడినా నొప్పి తగ్గదు.

';

గ్యాస్ట్రిక్: యాంటాసిడ్లు తీసుకోవడం, తక్కువ మొత్తంలో తరచుగా ఆహారం తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story