వర్షాకాలంలో సాయంత్రం వేడి వేడి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అయితే మిగిలిపోయిన అన్నంతో మిరపకాయ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ రెసీపీ ట్రై చేయండి.
మిగిలిన అన్నం, పొడవాటి మిరపకాయలు, శనగపిండి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా, చిటికెడు వాము, డీప్ ఫ్రై చేయడానికి వంటనూనె, క్రిస్పీగా కావాలంటే కార్న్ పౌడర్ తీసుకోవాలి.
మిక్సర్ జార్ తీసుకుని మిగిలిన అన్నంను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఆ మిశ్రమంలో శనగపిండి, కారం, వాము, బేకింగ్ సోడా, ఉప్పు, వేసి కలుపుకోవాలి. బజ్జీలకు కావాల్సినట్లుగా పలుచగా, గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి.
ఇప్పుడు మిరపకాయలు తీసుకుని మధ్యలోకి చీల్చుకుని అందులో స్టఫ్ కోసం చింతపండు, పుదీనా, నువ్వులు, ఉప్పుతో తయారు చేసిన పేస్టును పెట్టాలి.
స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయలను ముంచి నూనెలో వేయాలి.
మిరపకాయలు ముదురు బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు మీడియం మంటమీద వేయించాలి. రెండు వైపులా కాలే విధంగా చూసుకోవాలి.
అంతే సింపుల్ మిరపకాయ బజ్జీలు రెడీ. వేడి వేడి బజ్జీలకు మసాలా కానీ, టమోటా సాస్ తోకానీ తింటే అద్బుతమైన టేస్ట్ ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి.