ఇండియాలో ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులపై ప్రత్యక్ష, పరోక్ష పన్నులుంటాయి. కానీ కొన్ని దేశాల్లో అసలు ఇన్ కంటాక్స్ ఉండదని మీకు తెలుసా
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి కేంద్ర బడ్జెట్ సమర్పించారు
ఈసారి బడ్జెట్ లో ఉద్యోగులు ట్యాక్స్ మినహాయింపు కోరుకున్నారు. అందుకు తగ్గట్టే స్వల్ప ఊరట లభించింది.
అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పౌరులపై ఎలాంటి ట్యాక్స్ లేదంటే నమ్ముతారా
ఇంకొన్ని దేశాల్లో అయితే ఇన్ కంటాక్స్ చాలా తక్కువగా అంటే నామ మాత్రంగానే ఉంటుంది.
బహామస్, పనామా, కెమైన్ ఐల్యాండ్ వంటి దేశాల్లో ప్రజలపై ఏ విధమైన ట్యాక్స్ ఉండదు
మరో వైపు ఖతర్, సింగపూర్, యూఏఈ వంటి దేసాల్లో ప్రజలపై ఇన్ కంటాక్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది
ఈ దేశాలు ఆదాయం కోసం ఇతర మార్గాలపై ఆధారపడి ఉన్నాయి. ఖతార్, యూఏఈ దేశాలు ఖనిజం, ఆయిల్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటాయి.
అయితే ఇండియా వంటి దేశాల్లో ట్యాక్స్ ఫ్రీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వాలు పేద ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అందుకే ఇక్కడి ప్రభుత్వాలు ఉద్యోగస్థులు, వ్యాపారుల నుంచి ఇన్ కంటాక్స్ వసూలు చేస్తుంటాయి.