ఆహారాలు తీసుకోకపోవడం ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలామంది ఎసిడిటీతో పాటు మలబద్ధకం సమస్య బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది.
కొంతమందిలో మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు..ఒకే చోట కూర్చోవడం, తక్కువ నీటిని తీసుకోవడం వల్ల కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 3 నుంచి 4 రాత్రి నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు పొట్టను క్లీన్ చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.
పెరుగన్నం తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి ఎంతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ గుణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు ఒక కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల చియా విత్తనాలను వేసి ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ప్రతిరోజు మలబద్ధకంతో బాధపడేవారు పులియపెట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మలబద్ధకం సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్లకు పైగా నీటిని తాగడం చాలా ముఖ్యం.
మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట తప్పకుండా ఫైబర్ ఎక్కువ మోతాదులో లభించే యాపిల్ పండ్లను తీసుకోండి.