రాత్రిపూట అన్నం బదులు.. ఇంకేమన్నా తింటే బరువు తగ్గుతామా అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు.
చాలామంది అందుకే రాత్రిపూట అన్నం బదులు ఎక్కువగా పండ్లు తింటూ ఉంటారు.
అయితే రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే.. తినడం వల్ల బరువు తగ్గిపోతామనుకోవడం కరెక్ట్ కాదు.
బరువు తగ్గాలంటే సమతులాహారం తీసుకోవడంతో పాటు.. శరీరానికి తగిన వ్యాయామం చేయాలి.
ముఖ్యంగా రోజు మొత్తం కొవ్వు లేని ఆహారాన్ని తినాలి.
రాత్రిపూట తేలికపాటి ఆహారం ఉండడం మంచిదే, కానీ ఎటువంటి ప్రొటీన్ లేని ఆహారం మాత్రం ఉండకూడదు.
అందుకే కిచిడి, పులావ్, చిరుధాన్యాలతో చేసిన అల్పాహారాలు లాంటివి రాత్రిపూట తినవచ్చు.
అలా కాకుండా కేవలం పండ్లు మాత్రమే రాత్రిపూట తినడం వల్ల.. కొన్ని రకాల పోషకాలు శరీరానికి అందక అది ఆకలితో అలమటిస్తుంది.
కాబట్టి రాత్రి కనీసం ఏడు గంటల లోపు ..గోధుమలతో చేసిన, లేదా అన్నం, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినడం ఉత్తమం.