చాలామందికి చిక్కు తీసుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అయితే జుట్టు చిక్కులు రాకుండా ఉండాలంటే సహజమైన చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం.
కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం మృదువుగా ఉండేలా చేస్తుంది. మీరు బయటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా.. మరి ఎక్కువగా కాకుండా.. ఒక రెండు చుక్కల నూనె అయినా చేతికి తీసుకొని తలకి పెట్టుకోవడం మంచిది.
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు.. వారానికి రెండు సార్లు నూనె మసాజ్ చేయడం మంచి ఆచారం.
కొబ్బరి నూనెలో ఉండే ప్రోటీన్లు, పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో తోత్పరుతాయి.
నూనె వేడిచేసి గోరువెచ్చగా.. జుట్టు వేళ్ళ నుంచి చివర్ల వరకు మసాజ్ చేయండి.
నూనె పూసిన తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచి నెమ్మదిగా తల స్నానం చేయాలి.
ఈ చిట్కాను పాటిస్తే మీ జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండి ఇక చిక్కుల బాదరబందీ ఉండదు.