పాదాలను మృదువుగా ఉంచుకోవడం కోసం సరైన పాద సంరక్షణ.. చాలా ముఖ్యం.
మీ పాదాలు రోజూ నిద్రపోయే ముందు..గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచి.. మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం ద్వారా.. చాలా మృదువుగా మారుతాయి.
పాదాలు ఎండిపోకుండా ఉండాలంటే.. ఉదయాన్నే ప్రతిరోజూ నూనె లేదా వాసిలిన్ రాస్తే.. మృదుత్వం పెరుగుతుంది.
వారంలో కనీసం రెండుసార్లు తేలికపాటి స్క్రబ్బింగ్ చెయ్యడం ద్వారా పాదాల చర్మంపై ఉండే మృతకణాలు తొలగించి.. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవచ్చు.
పాదాలను మృదువుగా ఉంచుకోవడంలో.. సహజమైన నిమ్మకాయ రసం పూస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
పగుళ్లను సరిచేయాలంటే, రాత్రి నిద్రపోయే ముందు నూనె లేదా మాయిశ్చరైజర్ రాసి సాక్స్ ధరించడం మంచిది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. నిపుణుల సలహాల మేరకు వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.