ఎండిన కొబ్బరిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి లోపల నీరు మొత్తం ఎండిపోయిన తర్వాత డ్రై కోకోనట్ గా మారిపోతుంది.
ఈ డ్రై కోకోనట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..
ఎండుకొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులో మినరల్స్ అయినా కాపర్ మాంగనీస్ సెలీనియం పెద్ద మొత్తంలో లభిస్తాయి
ఎండుకొబ్బరిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బరువు తగ్గే వారికి ఇది ఒక మంచి ఛాయిస్..
ఎండు కొబ్బరిలో ప్రోటీన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.
ఎండుకొబ్బరిని పొడి రూపంలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని కూరల్లోనూ సాంబారులోనూ ఉపయోగిస్తారు.
ఎండుకొబ్బరిని మీరు ఆహారంలో తీసుకున్నట్లయితే లైంగిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సెలీనియం పురుషుల్లో సంతాన సమస్యలను తగ్గిస్తుంది.
రక్తహీనతకు కూడా ఎండుకొబ్బరి చెప్పి పెడుతుంది. ఇందులో ఉండే ఐరన్ మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది.
ఎండుకొబ్బరిని రెగ్యులర్ గా మీ ఆహారంలో చేర్చుకుంటే ప్రోస్ట్రేట్ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు