డ్రైఫ్రూట్స్ లో విటమిన్లు, జింక్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
జుట్టు పెరుగుదలకు మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన ఐదు హెల్తీ డ్రై ఫ్రూట్స్ ఏవో చూద్దాం.
బాదంపప్పులో విటమిన్లు ఈ, బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలతోపాటు జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయపడతాయి.
బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టును పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జీడిపప్పులో ప్రొటీన్, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
హాజెల్ నట్స్ లోని విటమిన్ ఇ హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.