పాకం పూరీలు ఇంటి ఫంక్షన్లకు, పండుగలకు ఎక్కవగా తయారు చేస్తారు.

Shashi Maheshwarapu
Aug 15,2024
';

వీటిని ఇంట్లోనే త్వరగా తయారు చేసుకోవచ్చు.

';

కావాల్సిన పదార్థాలు: మైదా పిండి - 250 గ్రాములు, ఉప్పు - 1/4 స్పూన్, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, నీరు - అవసరమైనంత

';

కావాల్సిన పదార్థాలు: పంచదార - 500 గ్రాములు, నీరు - 150 మిల్లీలీటర్లు, యాలకల పొడి - 1 టీస్పూన్

';

తయారీ విధానం: ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా రుబ్బుకోవాలి.

';

తర్వాత తగినంత నీళ్లు పోసి మెత్తగా పిండి కలిపి, 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి పక్కన పెట్టాలి.

';

ఒక పాత్రలో పంచదార, నీరు వేసి మంట మీద ఉంచి, తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి.

';

ఆ తర్వాత యాలకల పొడి వేసి దించాలి.

';

నానుతున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని పల్చగా వత్తుకోవాలి.

';

ఆ తర్వాత పూరీలపై నెయ్యి రాసి, మధ్యలో మడిచి మరోసారి మడిచి మందంగా వత్తుకోవాలి.

';

వేడి నూనెలో పూరీలు వేసి వేయించాలి.

';

వేడి వేడి పూరీలను వేడి పాకంలో ముంచి తీసి, వెంటనే వడ్డించాలి.

';

VIEW ALL

Read Next Story