కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యం పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఏది తినాలన్నా సరే ఆలోచించి..దాని గురించి పూర్తిగా తెలుసుకొని మరి ఫాలో అవుతున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన వారు ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి కొంతమంది భవిష్యత్తులో తమకు ఎక్కడ డయాబెటిస్ వస్తుందోనని ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు. అలాగే బరువు నియంత్రణ పై కూడా దృష్టి పెడుతున్నారు.
అందులో భాగంగానే రాత్రుళ్ళు భోజనానికి బదులు చపాతీలు తింటున్నారు. చపాతీలు తింటే బరువు.. తగ్గవచ్చు అని రాత్రి వేళల్లో వైట్ రైస్ మానేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
డైట్ లో భాగంగా పూర్తిగా ఒక పూట అన్నం తినడం మానేయడం కంటే అన్నం తక్కువ తినడం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు అన్నం తక్కువ తిని ఒక చపాతి తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవట.
వేడివేడిగా చేసే చపాతీలు, నూనె లేని చపాతీలు తినడం మంచిది. నిల్వ ఉంచిన చపాతీలు తినడం వల్ల పోషకాలు కోల్పోవచ్చు అంటారు కానీ చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదట.
రాత్రి వేళల్లో మాత్రమే చపాతీలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, గ్యాస్ , అల్సర్ వంటి కడుపు సంబంధిత రోగాలు దరి చేరవని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడేవారు చపాతీలు తినడం ఉపయోగకరం.
అయితే పూర్తిగా అన్నం వదిలేయకుండా అన్నంతో పాటు చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని పోషకాలు లభిస్తాయి.