యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే కీళ్లనొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతే యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టవచ్చు.
ఈ చట్నీ చేసేందుకు కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, నిమ్మ, నల్లఉప్పు కావాలి. యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఇవి మేలు చేస్తాయి.
కొత్తిమీర, పుదీనాలో డిటాక్సిఫైయింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్లం-వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్ వల్ల కలిగే వాపు , నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
నిమ్మకాయలో విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి శరీరం Phస్థాయిని నియంత్రిస్తుంది. యూరిక్ యాసిడ్ స్పటికాలను కరిగించడంలో సహాయపడుతుంది.
అన్ని పదార్థాలను కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. రుచి కోసం కొద్దిగా నల్లఉప్పు, జీలకర్ర పొడిని కలుపుకోవాలి.
ఈ చట్నీ రోజుకో సారి తినాలి. అన్నంలోకానీ రోటీలో కానీ తినవచ్చు. ఖాళీ కడుపుతో ఒక చెంచా కూడా తినవచ్చు.
ఈ చట్నీని తినడం వల్ల యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉండటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని తింటే శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.