ఈ లడ్డుతో అన్ని రోగాలు మాయం..

Dharmaraju Dhurishetty
Jul 05,2024
';

ఖర్జూరంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దీని వల్ల రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

';

నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తుంది.

';

ఖర్జూరంలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

నువ్వులలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర సమస్యలు దూరమవుతాయి.

';

ఖర్జూరంలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.

';

ఖర్జూరాలు ఫైబర్‌తో నిండి ఉండటం వల్ల కడుపు నిండిన భావాన్ని కలిగిస్తాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

';

మీరు కూడా ఈ రెండు పదార్థాలతో తయారు చేసిన లడ్డూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

';

కావలసిన పదార్థాలు: ఖర్జూరం - 1 కప్పు, నువ్వులు - 1/2 కప్పు, శనగపిండి - 1 టేబుల్ స్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్, యాలకుల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: ఖర్జూరాలను బాగా కడిగి, గింజలు తీసివేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

';

నువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, శనగపిండి వేసి వేయించాలి.

';

ఆ తర్వాత శనగపిండి బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత, ఖర్జూరం ముక్కలు, నువ్వులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

';

మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. మిశ్రమం చల్లబడిన తర్వాత, చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story