అంతేకాదు సొరకాయ ద్వారా ఒంట్లోని వేడిని కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి సొరకాయతో రుచికరమైన వడలను ఎలా చేసుకోవాలో చూద్దామా.
ముందుగా సొరకాయని గింజలు తీసేసి.. సొరకాయను తురుముకోవాలి.
తరువాత ఒక పాత్రలో ఈ సొరకాయ తురుము, రెండు సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కట్ చేసిన కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, రెండు స్పూన్ల బియ్యప్పిండి 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఒక కడాయిలో నూనెను బాగా వేడి చేసి.. ఈ సొరకాయ మిశ్రమాన్ని వడలుగా చేసుకొని అందులో వేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్ లో ఈ వడలను వేపుకోవాలి.. వడలు ఎరుపు రంగు రాగానే వాటిని తీసేయండి.
అంతే ఎంతో రుచికరమైన సొరకాయ వడలు రెడీ.