సమయం సరిపోవట్లేదని ముందుగా వండుకొని.. తినేటప్పుడు వేడి చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇలా అన్ని.. తిండి పదార్థాలను వేడి చేసుకుని తినడం మంచిది కాదు.
ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను.. అసలు వేడి చేసుకుని తినకూడదు.
అలా చెయ్యడం వల్ల మనం ఎన్నో అనారోగ్యాలకు గురికావచ్చు. మరి అలా వేడి చేసుకొని తినకూడని పదార్థాలేవో చూద్దాం..
చికెన్ ని మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
కోడిగుడ్లను మళ్లీ వేడి చేసుకొని తింటే.. టాక్సిక్ లా మారి జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
మష్రూమ్స్ ఒకసారి వండిన తర్వాత.. మళ్లీ వేడి చేసుకొని అసలు తినకూడదు.
బంగాళా దుంపలను మళ్లీ వేడి చేస్తే..టాక్సిక్ లా మారుతాయి.