గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పూట 1 కప్పు గ్రీన్ టీ తాగితే అనేకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీలో విటమిన్స్ ఎ, ఇ, బి5, కె, ప్రొటీన్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, వంటి మూలకాలు ఇందులో ఉన్నాయి.
గ్రీన్ టీ రాత్రి పడుకునే ముందు తాగాడం వల్ల అనేకు ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో చూద్దాం.
గ్రీన్ టీలో ఎల్ థియానిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రిలాక్సేషన్, యాంటీ యాంగ్జయిటీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది.
గ్రీన్ టీ తాగితే శరీరంలోని అదుపు కొవ్వు తగ్గుతుంది. ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ మిశ్రమాల్లో లభించే కెఫిన్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది.
నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగితే క్యాలరీలు కరిగిపోతాయి. వేగంగా బరువు తగ్గుతారు. రాత్రిపూట గ్రీన్ టీ తాగితే కొవ్వు వేగంగా కరుగుతుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతగుంది. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.
జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా కప్పు గ్రీన్ తాగాలని వైద్యులు చెబుతున్నారు.