షుగర్‌తో బాధపడేవాళ్లు సీతాఫలం తినవచ్చా? ఇవిగో నమ్మలేని నిజాలు
సీతాఫలంలో విటమిన్ సీ, విటమిన్ బీ6, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
సీతాఫలం పండు తినడం ద్వారా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి.
అడవిలో లభించే సీతాఫలంలో కేలరీలు, సహజ చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. తియ్యగా ఉండే ఈ పండ్లు మధుమేహులు తినాలా వద్దా? అనే సందేహాలు వస్తుంటాయి.
మధుమేహంతో బాధపడే వారు సీతాఫలాన్ని తినాలా వద్దా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతుండడంతో వీటికి కొందరు వైద్యులు కీలక ప్రకటన ఇస్తున్నారు.
సీతాఫలం పండులో గ్లైసెమిక్ సూచిక 54-55 మధ్య ఉంటుంది. ఈ పండు తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరిగే అవకాశం ఉంది.
సీతాఫలం తినడంతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. దీంతో మధుమేహ బాధితులు సీతాఫలం మరి తినకుండా ఉండకుండా తక్కువ తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ బాధితులు రోజుకు ఒకటి లేదా రెండు పండ్లను మాత్రమే తినాలి. అయితే రెండు పండ్లు ఒకేసారి తినకూడదు.
కార్బొహైడ్రేట్ అధికంగా ఉండడంతో సీతాఫలాన్ని అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
ఈ సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా అందిస్తున్నాం. ఈ విషయాలను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. వైద్య నిపుణులను సంప్రదించి వీటిని పాటించండి.