ఈమధ్య రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన ఉదయాన్నే ఎలా మొదలుపెరుతాను అనే విషయం చెప్పుకొచ్చింది. అంతేకాదు దానివల్లే తాను బరువు అదుపులో పెట్టగలను అని కూడా చెప్పింది. మరి అదేమిటో ఒకసారి చూద్దాం.
బరువు త్వరగా తగ్గాలి అనుకుంటే సరిపోదు.. మన ఆరోగ్యాన్ని అనుసరించి బరువు తగ్గాలి.
తిండి మానేయడం కన్నా కొన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఎంతో ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
అందులో మొదటిది జీలకర్ర నీళ్లు. ఈ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతీ రోజూ జీలక్రర నీటిని తాగితే.. మన శరీరంలో ఉండే అదనపు బరువు నుంచి త్వరగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియను, జీవ క్రియలు మెరుగుపడతాయి.
ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రకుల్.