మనం నూనె ఎంత తక్కువ.. వాడితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే నూనె తక్కువ వాడితే.. వంట రుచికరంగా ఉండదు అనుకుంటారు ఎంతోమంది. కానీ ఒక్క చుక్క నూనెతో కూడా ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. మరి అవేవో ఒకసారి చూద్దాం.
మనం రోజు తినే ఆహారాల్లో మనకు అస్సలు నూనె అవసరంలేని.. పదార్థం ఇడ్లీ. కేవలం బియ్యప్పిండితోనే కాకుండా..మఖానాతో, ఓట్స్‌తో, క్వినోవాతో.. అలానే క్యారెట్ తురుముతో కూడా ఇడ్లీలు చేయొచ్చు.
ముఖ్యంగా ఓట్స్ తో చేసిన ఇడ్లీలు తినడం వల్ల.. డయాబెటిక్ లాంటి వ్యాధులకు మనం ఎంతో దూరంగా ఉండొచ్చు.
జావ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు పొద్దున్నే జావతాగడం వల్ల ఎన్నో అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే జావ లేదా అంబలిని రాగిపిండితో చేసుకుంటే మన శరీరానికి ఎంతో మంచిది.
రాగి పిండితోనే కాదు.. ఈ జావ..జొన్న పిండితో చేసుకోవచ్చు. ఈ జావ కోసం చుక్క నూనె కూడా అవసరం లేదు.
హిందీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థం దోక్లా. దీనికోసం మనకు ఒక్క చుక్క నూనె సరిపోతుంది.
శనగపిండి, రవ్వ కలుపుకున్న మిశ్రమాన్ని ఆవిరి మీద బాగా ఉడికించుకొని.. చిన్న కేకు ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆర చెంచా నూనెతో.. పోపు వేసుకుంటే చాలు. దోక్లా రెడీ అయిపోతుంది.