బరువుతగ్గడం కోసం అన్నం మానేసి డైటింగ్ చేయాలి అంటే.. చాలా మందికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.
ఒక పూట అన్నం తినకపోతేనే రెండో పూట ఎక్కువగా తినేస్తూ ఉంటారు.. మరి అన్నం మానలేనప్పుడు వెయిట్ తగ్గడం ఎలానో ఒకసారి చూద్దాం
బరువుతగ్గాలి అని ఉన్నప్పటికీ.. వైట్ రైస్ మానలేనివారు.. తమ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది.
మీరు తీసుకునే అన్నం క్వాంటిటీ మితంగా ఉండేలా చూసుకోవాలి.
అన్నం పెట్టుకున్నప్పుడు ప్లేట్లు అన్నంతో పాటు సమభాగంలో ఫైబర్ ఉన్న ఫుడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ లాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
చాలా కొంచెం కొంచెంగా అన్నం వేసుకోండి
అన్నం తినేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ లాంటివి అసలు చూడకండి.
భోజనానికి గంట ముందు గోరువెచ్చటి నీరు ఒక గ్లాసు తీసుకోవాలి.
భోజనానికి వీలైనంత చిన్న సైజు ప్లేటు వాడాలి.
చాక్లెట్స్, స్వీట్స్ అస్సలు తినకండి. చక్కెర ఏదో ఒక్క పూట టీ తాగేటప్పుడు మాత్రం వేసుకోండి.
ఈ చిన్ని టిప్స్ ఫాలో అయితే చాలు.. అన్నం తినడం మానకుండానే బరువు తగ్గొచ్చు