ఈ సలాడ్‌ రోజు తింటే.. మహా అద్భుతమే..

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

బంగాళాదుంప సలాడ్ రెసిపీని రోజు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

';

బంగాళాదుంప సలాడ్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. రోజు అల్పాహారంలో తీసుకోవడం చాలా మంచిది.

';

బంగాళాదుంప సలాడ్‌ని ప్రతి రోజు తింటే పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఎంతో సులభంగా ఇంట్లోనే బంగాళాదుంప సలాడ్ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

బంగాళాదుంప సలాడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు: 4-5 (చిన్నగా కట్‌ చేసిన ముక్కలు), ఉల్లిపాయ: 1 (చిన్నది), క్యారెట్: 1 (మధ్య తరహా)

';

కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ: 1/4 కప్పు (చిన్న ముక్కలు), కొత్తిమీర: 1/4 కప్పు (చిన్న ముక్కలు), పుదీనా: 1/4 కప్పు (చిన్న ముక్కలు), మెయోనిస్: 1/4 కప్పు

';

కావాల్సిన పదార్థాలు: పెరుగు: 1/4 కప్పు, ఉప్పు: రుచికి తగినంత, మిరియాల పొడి: రుచికి తగినంత, నిమ్మరసం: 1 టీస్పూన్ (తగినంత), చాట్ మసాలా: 1/2 టీస్పూన్ (తగినంత)

';

తయారీ విధానం: ముందుగా ఈ సలాడ్‌ తయారు చేసుకోవడానికి బంగాళాదుంపలను తీసుకుని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా శుభ్రం చేసిన దుంపలను ముక్కలుగా కోసి.. ఒక పాత్రలో నీటిని ఉప్పు వేసుకుని ముక్కలు వేసి మరిగించండి..

';

బాగా ఉడుకించుకున్న ముక్కలను తీసుకుని చల్లని నీటిని వేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఉల్లిపాయలను తీసుకుని, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుని క్యారెట్‌, క్యాబేజీని తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోండి.

';

ఇలా ముచ్చలు చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా బాగా కట్ చేసి పెట్టుకోండి.

';

పెద్ద బౌల్‌ తీసుకుని అందులో అన్నింటినీ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయోనిస్, పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకోండి.

';

చివరగా అన్ని వేసుకుని కలుపుకుని చాట్ మసాలా వేసి కలుపుకోండి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story