జామఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం ఈ ఆకుతో తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో విటమిన్ సి ఉంటుంది.
ఆయుర్వేదంలో తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం తులసి ఆకులు నమిలినా..టీ చేసుకుని తాగినా బరువు తగ్గుతారు.
బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గతారు. బిర్యానీ ఆకులను నీళ్లలో వేసి 10నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత అందులో తేనె కానీ నిమ్మరసం కానీ కలుపుకుని తాగాలి.
పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. లీటర్ నీటిలో 10 ఆకులు వేసి బాగా మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
కొత్తిమీర ఆకులతో తయారు చేసిన ఈ టీ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ఉన్నాయి. ఖాళీ కడుపుతో తాగితే మంచిది.
జామూన్ ఆకుతో తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గుతారు. 1 కప్పు నీరు మరిగించిన అందులో జామున్ ఆకులు వేయాలి. పొడి చేసుకుని వేడినీళ్లలో కలుపుకుని కూడా తాగవచ్చు.
గ్రీన్ టీ సహజ డిటాక్స్ పానీయంగా పని చేస్తుంది. రోజుకో కప్పు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారికి ఎంతగానో సహాయపడుతుంది.