అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు లేకపోవడం వల్ల ఈ గుండె సమస్యలు వస్తున్నాయి.
గుండెలోని ధమనులతో పాటు నరాల్లో కొలెస్ట్రాల్ పేరుపోవడం వల్ల గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు.
గుండె సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలు తినకూడదు..
మైదా పిండిలో శరీరానికి కావాల్సిన ఎలాంటి పోషకాలు లభించవు. కాబట్టి ఇది శరీరంలోని కొవ్వును పెంచే ఛాన్స్ కూడా ఉంది.
కోడి గుడ్డులో సంతృప్తి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని తీసుకోవడం వల్ల గుండెపోటు సమస్యలు రావచ్చు.
ప్రతి రోజు చక్కెర అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి.
గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో అధికంగా ఉప్పుడు తినడం కూడా ఒకటి. దీని కారణంగా కూడా చాలా మందిలో గుండె పోటు వస్తోంది.
ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలు తీసుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.