Refrigerator Safety:

వర్షాకాలంలో ఈ తప్పులు చేస్తే ఫ్రిడ్జ్ బాంబులా పేలుతుంది

Ravi Kumar Sargam
Aug 07,2024
';

ప్రతి ఒక్కరి ఇంట్లో..

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఏడాది మొత్తం ఇది ఉపయోగంలోనే ఉంటుంది. ఫ్రిడ్జ్‌ను జాగ్రత్తగా చూసుకోకుంటే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

';

కొన్ని తప్పులు

ఫ్రిడ్జ్‌ వినియోగించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులతో రిఫ్రిజిరేటర్‌లో భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంది. మీరు రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా నిర్వహించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.

';

విద్యుత్ సరఫరా

విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉంటే రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించకూడదు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరిగితేనే ఫ్రిడ్జ్‌ వినియోగించాలి.

';

మంచు గడ్డ

డీప్‌ ఫ్రిజ్‌లో మంచు గడ్డ కట్టనివ్వవద్దు. ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేయండి. అంటే గడ్డ కట్టిన మంచు ఎప్పుడూ కరిగేలా చూడాలి.

';

స్థానికంగా కాకుండా

కంప్రెసర్ భాగంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మరమ్మతులు చేసుకోవాలి. స్థానిక ఎలక్ట్రీషియన్‌ను కాకుండా ఫ్రిడ్జ్‌ కంపెనీ వారితో మరమ్మతు చేయిస్తే క్షేమదాయకం. రిఫ్రిజిరేటర్‌లో స్థానిక భాగాలను ఉపయోగిస్తే కంప్రెసర్‌లో పేలుడుకు కారణమవుతుంది.

';

ఆఫ్‌ చేయండి

ఫ్రిజ్‌లో ఎలాంటి వస్తువులు లేకపోతే ఫ్రిజ్‌ను ఆఫ్‌ చేసేయండి.

';

ఈ నంబర్‌లో మాత్రమే..

ఎల్లప్పుడూ ఫ్రిజ్‌ను 3 నుంచి 4 నంబర్‌లో మాత్రమే ఉంచండి. ఇది కంప్రెసర్‌ను పెద్దగా ప్రభావితం చేయదు. దీనివలన ఫ్రిడ్జ్‌ ప్రమాదం లేకుండా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story