చిలకడదుంపలు అనగా స్వీట్ పొటాటో.. తినొచ్చా లేదా అనేది ఎంతోమంది సందేహం.
ముఖ్యంగా షుగర్ పేషంట్స్.. స్వీట్ పొటాటో అనగానే.. తీయనైన దుంపల జాతికి సంబంధించినవేమో..అసలు తినకూడదేమో అనుకుంటారు .
కానీ ఇవి..మితంగా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.
చిలకల దుంపల్లో విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి వల్ల.. రోగనిరోధక శక్తిని, ఎముకల ఆరోగ్యాన్ని ఈ చిలకడ దుంపలు మన శరీరంలో పెంచుతాయి.
అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ సి.. మనకు జలుబు, దగ్గు లాంటి రోగాలను దూరంగా ఉంచుతుంది.
అలానే మన ఎముకలు దంతాలు, బలంగా మారుతాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా చిలకడదుంపలు క్యాన్సర్ వ్యాధిని.. కలుగచేసే కారకాల చర్యలను మన జోలికి రానికుండా చూసుకుంటాయి.
పొట్టలో ఏర్పడే అల్సర్‌లను, ఎసిడిటీ సమస్యలను సైతం తగ్గించే ఔషధ గుణం ఈ చిలకల దుంపల్లో ఉండడం విశేషం.