రోజు పడుకునే ముందు నడవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల నిద్ర మెరుగుపడడమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది.
';
రోజు నిద్రపోయే ముందు 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో తెలుసుకోండి.
';
రోజు నిద్రపోయే ముందు నడవడం వల్ల శరీరంలోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దీనికి కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి.
';
రోజు నడవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
';
భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు కిలోమీటర్ పాట నడవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
';
రోజు పడుకునే ముందు 200 అడుగులు నడవడం వల్ల హృదయ స్పందన మెరుగు పడుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
';
రోజు నడవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం రాకుండా హార్మోన్లు సహాయపడతాయి.
';
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు రోజు పడుకునే ముందు 30 నిమిషాల పాటు తప్పకుండా నడవండి. ఇలా చేయడం వల్ల గొప్ప రిలీఫ్ లభిస్తుంది.
';
రాత్రి నిద్ర పోయే ముందు నడవడం వల్ల శరీర నొప్పులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
రోజు 30 నిమిషాల పాటు రాత్రి పడుకునే ముందు నడిస్తే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.