రసాయనాలు కలిగిన షాంపూలు, సభ్యులు వాడడం వల్ల కూడా జుట్టు త్వరగా నెరిసిపోతుంది. అయితే 30 ఏళ్లకే జుట్టు నెరిసిపోతున్న నేపథ్యంలో కొన్ని రకాల చిట్కాలు మళ్లీ జుట్టును నల్లగా బలంగా మారుస్తాయి. మరి ఏంటో చూద్దాం.
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు ఉదయం 10 ml ఉసిరి జ్యూస్ తాగితే జుట్టు తెల్లబడడం ఆగిపోతుంది.
నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఇది జుట్టు విషయంలో మ్యాజిక్ చేస్తుంది. వారానికి రెండుసార్లు నల్ల జీలకర్రతో హెయిర్ మాస్క్ వేయడం వల్ల జుట్టు త్వరగా నల్లగా మారుతుంది.
కరివేపాకు కూడా జుట్టు నల్లబడడానికి సహాయపడుతుంది. కరివేపాకు ఆకులు హెయిర్ ఫోలికల్స్ లో మెలనిన్ ఉత్పత్తిని పునరుద్ధరించి, తెల్ల జుట్టును తగ్గిస్తాయి. ప్రతిరోజు నాలుగు కరివేపాకులు తింటే ఫలితం మీరే గమనించవచ్చు.
గోధుమ గడ్డి జ్యూస్ భోజనంలో ఒక స్పూన్ తీసుకున్నట్లయితే జుట్టు కుదుళ్ళు బలంగా మారి, జుట్టు నల్లగా మారుతుంది.
జుట్టు నల్లగా మారడానికి నల్ల నువ్వులు కూడా పనిచేస్తాయి. భోజనంలో రోజూ ఒక్క టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు తినడం వల్ల జుట్టు నల్లగా ఆరోగ్యంగా మారుతుంది.