ఎంతో ఈజీగా గోధుమ పిండి లడ్డును ఎలా చేసుకోవాలో చూడండి

Shashi Maheshwarapu
Nov 26,2024
';

గోధుమ పిండి లడ్డు ఆరోగ్యానకి ఎంతో మేలు చేస్తుంది.

';

దీని తయారు చేయడం ఎంతో సులభం.

';

కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమలు, చక్కెర, నెయ్యి

';

పాలు, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు, యాలకుల పొడి

';

తయారీ విధానం: ఎర్ర గోధుమలను శుభ్రం చేసి, వేడి చేసిన పాత్రలో వేసి దోరగా వేయించాలి.

';

వేయించిన గోధుమలను మిక్సీలో మెత్తగా అరగదీయాలి.

';

పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి.

';

చక్కెరను మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.

';

ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా తరిగితీసుకోవాలి.

';

గోధుమ పిండి, చక్కెర పొడి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడిలను ఒక పాత్రలో కలపాలి.

';

ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని,

';

నెయ్యి గాని వేసి బాగా కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది.

';

ఈ ముద్దను తీసుకొని కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.

';

VIEW ALL

Read Next Story