ఉప్మా తినడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే చాలామందికి ఉప్మా తినడం ఇష్టం లేదు. అలాంటి ఉప్మాని ఎంతో రుచికరంగా చేసుకోవచ్చని మీకు తెలుసా..?
రుచికరమైన జీడిపప్పు ఉప్మా కావలసిన పదార్థాలు: జీడిపప్పు (పెన్నగింజలు) - 1/2 కప్పు, రవ్వ (సోసికర) - 1 కప్పు , ఉప్పు - తగినంత ,పెరుగు లేదా నిమ్మరసం - 1 టీస్పూన్, 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు.
జీడిపప్పు ఉప్మా తయారీ కోసం..మొదట జీడిపప్పులను వేయించి పెట్టాలి. ఆ తర్వాత పాన్‌లో నీ రవ్వని గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి.
జీడిపప్పులు వేయించిన తర్వాత, ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి.. మిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం.. ఒక కప్పు పెరుగు వేసి.. అందులోనే కొద్దిగా నీళ్లు పోసి.. రవ్వ కూడా వేసి కలుపుకోవాలి.
అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 5 నిమిషాలు సన్నని మంటపై ఉంచి ఉడికిస్తే ఎంతో రుచికరమైన జీడిపప్పు ఉప్మా రెడీ.
ఈ జీడిపప్పు ఉప్మా లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా తక్కువ క్యాలరీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్.
మరెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన ఈ ఉప్మాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.